25న ప్రేక్షకుల ముందుకు రానున్న నాని వీ మూవీ

0
40
Nani Next Telugu Movie With Vivek Athreya - Sakshi

హీరోగా, నిర్మాతగా వరుస హిట్లతో నేచురల్‌ స్టార్‌ నాని ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇటు తన సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు నిర్మిస్తూనే.. హీరోగా వరుస చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగానే ‘టక్‌ జగదీష్‌’ను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు. ‘టక్‌ జగదీష్‌’ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమాను అనౌన్స్‌ చేశారు. అయితే తాజాగా మరో క్రేజీ సినిమాకు నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.

‘బ్రోచేవారెవరురా’తో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు కమిట్‌ అయినట్టు సమాచారం. వివేక్‌ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో అతడితో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వివేక్‌ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో పడ్డాట. అయితే ఈ చిత్రాన్ని పూర్తి వినోదభరితంగా తెరకెక్కించాలని వివేక్‌ భావిస్తున్నాడట. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనుందని టాక్‌. అన్నీ కుదిరితే ‘నాని గ్యాంగ్‌ లీడర్‌’ తర్వాత మైత్రి నిర్మాణ సంస్థలో నాని చేయబోతున్న సినిమా ఇదే కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here