హుచ్చా వెంకట్‌ మళ్లీ వీరంగం

0
6

హుచ్చా వెంకట్‌ మళ్లీ వీరంగం

Huccha Venkat Misbehave With Woman in Karnataka - Sakshiటోల్‌ వద్ద యువతి వెంటపడిన హుచ్చ

మారసంద్ర టోల్‌ వద్ద యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన

కారు గ్లాస్‌ పగలగొట్టుకుని పిచ్చిపిచ్చిగా కేకలు

కర్ణాటక ,దొడ్డబళ్లాపురం:  కన్నడ సినీ హీరో, నిర్మాత హుచ్చ వెంకట్‌ ఇటీవలే సకలేశపుర, కొడగు, మైసూరు తదితర ప్రదేశాల్లో పబ్లిక్‌గా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి స్థానికులతో గొడవపడి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం అదే హుచ్చా వెంకట్‌ హిందూపురం–యలహంక రహదారి మార్గంలోని మారసంద్ర టోల్‌ వద్ద వీరంగం సష్టించాడు. దొడ్డబళ్లాపురం మీదుగా టోల్‌ వద్దకు వచ్చిన వెంకట్‌ అక్కడే తన కారు నిలిపి టోల్‌ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న కాలేజ్‌ అమ్మాయి దగ్గరకు వెళ్లి తనను ప్రేమించమని,పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు.అమ్మాయి భయంతో అక్కడి నుండి పరుగులు తీసింది.తరువాత వెంకట్‌ తన కారు అద్దాలను తనే రాళ్లతో పగలగొట్టుకున్నాడు.స్థానికులపై అరిచాడు.అంతలో సమాచారం అందుకున్న రాజానుకుంట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హుచ్చ వెంకట్‌ను స్టేషన్‌కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here