‘హిట్‌’ మూవీ రివ్యూ

0
16
Hit Telugu Movie Review And Rating, Nani, Vishwak Sen - Sakshiవిశ్వక్‌ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫస్ట్‌ కేస్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌ . హీరో నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నాని ప్రొడ్యూసర్‌గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? క్రైమ్‌ స్టోరీని దర్శకుడు శైలేష్‌ కొలను తెరపై చక్కగా ప్రజెంట్‌ చేశాడా? విశ్వక్‌ సేన్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేట్‌ ఆఫీసర్‌గా ఏ మేరకు మెప్పించాడు? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం(హిట్‌) ఓ విభాగం. హిట్‌కు విశ్వ (భానుచందర్‌) హెడ్‌. విశ్వ టీంలోనే విక్రమ్‌ (విశ్వక్‌ సేన్‌), అభిలాష్ (శ్రీనాథ్‌ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు)లు ఎంతో సిన్సియర్‌ అండ్‌ టాలెంటెడ్‌ ఆఫీసర్స్‌. ప్రతీ క్రైమ్‌ కేసును సులువుగా ఛేదిస్తుంటారు. ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న నేహ(రుహానీ శర్మ), విక్రమ్‌ల మధ్య ఎప్పటినుంచో ప్రేమ కొనసాగుతోంది. ఈ క్రమంలో నగరంలో ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేహ కూడా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేస్తారు.
ఈ కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే బాధ్యతను విక్రమ్‌కు విశ్వ అప్పగిస్తాడు. అయితే కేసుకు సంబంధించి ఎటువైపు వెళ్లినా అన్ని దారులు మూసుకపోతుంటాయి. కేసులో భాగంగా విచారిస్తున్న వారందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. అయితే ఈ కేసులోకి షీల(హరితేజ), షిండే (బ్రహ్మాజీ), ఇ​బ్రహీం(మురళీ శర్మ)లు ఎందుకు ఎంటర్‌ అవుతారు? చివరికి ఈ కేసును విక్రమ్‌ ఛేదించాడా? ప్రీతి, నేహాలకు ఏమైంది? వారిని కిడ్నాప్‌ చేసింది ఎవరు? రెండు కిడ్నాప్‌లు చేసింది ఒకరేనా లేక ఇద్దరా? అసలు విక్రమ్‌కు ఉన్న ఆ వింత వ్యాధి ఏంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here