సౌత్ లో ఆ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న మహేష్..!

0
23

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి1’ కలెక్షన్లను అధిగమించింది. అయితే సంక్రాంతి విన్నర్ ‘అల వైకుంఠపురములో’ కల్లెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది ఈ చిత్రం. ఇక తన తరువాతి చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేస్తానని చెప్పిన మహేష్.. స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి చెందక దానిని హోల్డ్ లో పెట్టాడట. ఇదిలా ఉండగా.. మహేష్ ఇప్పుడు మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు.

వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో మహేష్ టాప్ లో ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇక తన ట్విట్టర్ ద్వారా అభిమానులకి మరింత దగ్గరగా ఉంటూ.. తన కొత్త సినిమాల అప్డేట్స్ ను తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు తన సినిమా కాకపోయినా.. అది మహేష్ ను మెప్పిస్తే .. దానిని ప్రశంసిస్తూ ట్వీట్లు కూడా వేస్తాడు. అందుకే ట్విట్టర్ లో అతని ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు అది 9 మిలియన్ కు చేరుకుంది. సౌత్ లో 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా మహేష్ బాబు సరికొత్త రికార్డు సృష్టించాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here