సౌత్ మూవీకి అక్కడ సీక్వెల్ ఏంటి గురూ?

0
17
సూర్య హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 2005వ సంవత్సరంలో వచ్చిన ‘గజినీ’ చిత్రం ఎంతటి సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గజినీ చిత్రాన్ని అదే టైటిల్ తో హిందీలో అమీర్ ఖాన్ హీరోగా 2008లో మురుగదాస్ రీమేక్ చేశాడు. హిందీలో మొదటి వంద కోట్ల సినిమాగా గజినీ నిలిచింది. సౌత్ రీమేక్ బాలీవుడ్ లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలవడంతో గజినీ చాలా స్పెషల్ మూవీగా అంతా భావిస్తారు.గజినీ చిత్రంకు సీక్వెల్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ గతంలో ఒక ఇంటర్వ్యూలో సీక్వెల్ విషయమై ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాజాగా సీక్వెల్ గురించి మరో ఆసక్తికర అప్ డేట్ అందుతోంది. అమీర్ ఖాన్ సీక్వెల్ చేసేందుకు దర్శకుడు మురుగదాస్ కు ఓకే చెప్పినట్లు గా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఈ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందని మురుగదాస్ సన్నిహితులు చెబుతున్నారు.

తమిళ ఆడియన్స్ మాత్రం గజినీ చిత్రానికి మొదట ఇక్కడ సీక్వెల్ చేయాలని ఆ తర్వాత బాలీవుడ్ లో రీమేక్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సౌత్ లో హిట్ అయిన మూవీకి అక్కడ సీక్వెల్ ఎలా తీస్తారు.. మురుగదాస్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ తమిళ తంబీలు కోరుతున్నారు. మరి మురుగదాస్ మాత్రం బాలీవుడ్ లోనే సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో మురుగదాస్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here