సుధీర్ బాటలో ఆది.. అతనితో పోటీ కూడా పడుతున్నాడటా…!

0
39

Image result for sudheer, aadhi images of latest

బుల్లితెర మీద నవ్వుల జల్లులు కురిపిస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిన విషయమే. ఆ షో ద్వారా చాలామంది ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఐదారేళ్లుగా తమ కామెడీతో మెప్పిస్తున్న జబర్దస్త్ స్టార్స్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. కమెడియన్లు కామెడీ కాకుండా ఇంకేం చేస్తారని ఆశ్చర్యపోవచ్చు.. జబర్దస్త్ కమెడియన్లు ఇప్పుడు సింగర్స్ గా మారనున్నారు. సుడిగాలి సుధేర్ ఆల్రెడీ తన సింగింగ్ టాలెంట్ చూపించాడు. నిన్నుకోరి సినిమాలోని అడిగా అడిగా సాంగ్ పాడి అందరిని అలరించిన సుధీర్ లేటెస్ట్ గా మరో సాంగ్ 3 సినిమా నుండి వై దిస్ కొలెవెరి డి సాంగ్ పాడాట.

సుధీర్ పాట పాడటం ఇదివరకు చూశాం కానీ కొత్తగా హైపర్ ఆది కూడా సాంగ్ పాడాడు. నువ్వే కావాలి సినిమా నుండి అనగనగా ఆకాశం ఉంది సాంగ్ పాడాడట. ఏదో కూనిరాగంలా పాడటం కాదు సింగర్స్ రేంజ్ లో బాగా ప్రాక్టీస్ అయ్యి ఈ సాంగ్స్ పాడినట్లు ప్రకటించారు. సుధీర్, ఆది ఇద్దరు సాంగ్స్ పాడి అదరగొట్టారు. ఉగాది సందర్భంగా పండుగ సార్ పండుగ అంతే.. ప్రోగ్రామ్ లో జబర్దస్త్ కమెడియన్ల సందడి ఓ రేంజ్ లో ఉండేలా ఉంది.

జబర్దస్త్ తో పాటుగా ఢీ షోలో కూడా సుధీర్, హైపర్ ఆదిలా హంగామా బాగుంది. ఇద్దరు తమ కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. సుధీర్ అడుగుజాడల్లో వెళ్తూ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఉగాది నాడు ఎలాగూ థియేటర్స్ తెరచుకునే వీలు లేదు కాబట్టి ఆడియెన్స్ ఎంటర్టైన్ చేసేందుకు బుల్లితెర సిద్ధమవుతోంది. మాల్స్, స్కూళ్ళు, కాలేజీలు, పార్టీలు, పబ్బులు, బార్లు అన్ని బంద్ చేయడం వల్ల అందరు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యేలా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here