సిఎం పాత్రలో నటిస్తున్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్

0
38

Image result for pavan kalyan latest images

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించి చేసుకుంటూ పోతున్నాడు. అయితే తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యాడట. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేయడానికి అతను ఓకే చెప్పాడని తెలిసింది. పూరీతో ఇదివరకే రెండు సినిమాలు చేసిన పవన్‌కు అతనితో ఇది మూడోవ చిత్రం. రీ ఎంట్రీలో వరుసగా వేగంగా సినిమాలు చేస్తున్న పవన్ తాజాగా పూరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇక పూరి ఈ సినిమాలో పవన్ పాత్రను సిఎం అయ్యే కథనాయకుడిగా తీర్చిదిద్దాడట. అప్పట్లో మహేష్ బాబుతో ‘జనగణమన’ ప్రకటించిన పూరి ఆ సినిమాను పట్టాలెక్కించలేదు. ఇప్పుడు అదే కథను పవన్‌తో తీస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాపై అధికారికంగా ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here