సింహస్వప్నంలా వస్తున్నాడు

0
13
krishna manohar ips release on 7 feb - Sakshiమల్టీటాలెంటెడ్‌ ప్రభుదేవా తొలిసారి పోలీసాఫీసర్‌ పాత్రలో హీరోగా నటించిన చిత్రం ‘పొన్‌ మాణిక్వెల్‌’. ఎ. ముగిల్‌ చెల్లప్పన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించారు. ‘బాహుబలి’ ప్రభాకర్, సురేష్‌ మీనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తెలుగులో ‘కృష్ణ మనోహర్‌ ఐ.పి.ఎస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 7న విడుదల కానుంది. పవనపుత్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై యనమల సుధాకర్‌ నాయుడు సమర్పణలో ఆర్‌. సీతారామరాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో సంఘవిద్రోహ శక్తుల పాలిట హీరో సింహస్వప్నంలా ఎలా నిలిచాడు? అన్నదే కథ’’ అన్నారు సుధాకర్‌. ఈ సినిమాకు భువన చంద్ర సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here