సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు

0
18

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని సింగరేణి పాఠశాల మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను బెల్లంపల్లి ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ ఔ. లక్ష్మణ్‌ రావు ప్రారంభించారు. అనంతరం మహిళలకు మ్యూజికల్‌ చైర్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, షాట్‌పుట్‌ పోటీలు, బాలికలకు మ్యూజికల్‌ చైర్‌ పోటీలు నిర్వహించారు. బుధవారం మాదరం, ఈ నెల 5న బెల్లంపల్లిలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తన్నట్లు తెలిపారు. గెలుపొందిన విజేతలకు ఈ నెల 8న గోలేటి సింగరేణి పాఠశాలలో నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో బెల్లంపల్లి జీఎం కెజకొండయ్య, సేవా సమితి అధ్యక్షురాలు లక్ష్మీకుమారి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియా డీవైపీఎం ఎల్‌.రామశాస్త్రీ, సీనియర్‌ పీవో విశ్రాంత్‌ కుమార్‌, డబ్ల్యూపీఎస్‌ కోఆర్డినేటర్‌ జీపీ చంద్రకుమార్‌, పీఈటీ కె.భాస్కర్‌, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here