సామ్‌ను ప్రశంసించిన రానా..!

0
6

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటి సమంతను రానా దగ్గుబాటి ప్రశంసించారు. ఇటీవల జీ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో సమంత ఉత్తమ నటిగా అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాదిలో తెలుగులో ‘మజిలీ’, ‘ఓ బేబీ’ చిత్రాలతోపాటు తమిళంలో ‘సూపర్‌డీలక్స్‌’ సినిమాలో నటించిన సమంత ఎందరో ప్రశంసలు అందుకున్నారు. ఈ మూడు చిత్రాలకు గాను తెలుగు, తమిళ భాషల్లో సమంత ఉత్తమ నటిగా రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన సామ్‌.. రెండు భాషల్లో ఉత్తమ నటిగా అవార్డులను అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రానా ట్విటర్‌ వేదికగా సామ్‌ను ప్రశంసించారు. ‘జీ అవార్డ్స్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఉత్తమ నటిగా గెలుపొందిన సమంతకు నా అభినందనలు. ఈ అవార్డుకు నువ్వు అర్హురాలివి. ఎందుకంటే 2019లో ‘ఓ బేబీ’, ‘మజిలీ’, ‘సూపర్‌డీలక్స్‌’ సినిమాల్లో చాలా అద్భుతమైన పాత్రలు పోషించావు’ అని రానా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here