సామ్‌కి ఇది ఇష్టం.. చైతన్యకేమో అది..!

0
20

హైదరాబాద్‌: కథానాయిక సమంతకు ‘ఏ మాయ చేసావె’ సినిమాలోని ‘ఈ హృదయం కరిగించి వెళ్లకే..’ పాటంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఆమె భర్త నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. సాయిపల్లవి కథానాయిక. ఈ సినిమాలోని ‘ఏ పిల్ల..’ అనే పాట లిరికల్‌ వీడియోను మార్చి 11న సాయంత్రం 4.05కు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ పాట ప్రోమోను చిత్ర బృందం షేర్‌ చేసింది.

ఈ నేపథ్యంలో చైతన్య ఓ ట్వీట్‌ చేశారు. ‘మీకు ఇష్టమైన ప్రేమపాట ఏంటి?’ అని నెటిజన్లను ప్రశ్నించారు. ‘నాకు చాలా ఇష్టమైన ప్రేమ పాటల్లో ‘సాహసం శ్వాసగా సాగిపో’లోని ‘వెళ్లిపోమాకే..’ ఒకటి. మీకిష్టమైన పాటను నాకు తెలపండి’ అంటూ #myfavlovesong అనే ట్యాగ్‌ను మొదలెట్టారు. దీన్ని చూసిన సమంత ”ఏ మాయ చేసావె’లోని ‘ఈ హృదయం..’ నాకెంతో ఇష్టమైన గీతం’ అని ట్వీట్‌ చేశారు. చాలా మంది నెటిజన్లు చైతన్యకు రిప్లై ఇచ్చారు. తమకిష్టమైన పాటలు తెలిపిన వారికి ఓ సర్‌ప్రైజ్‌ ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here