సామజవరగమన @ 100 మిలియన్స్‌

0
2
Samajavaragamana scores 100 million views online - Sakshi

పూజాహెగ్డే, అల్లు అర్జున్

‘సామజవరగమన… నిను చూసి ఆగగలనా..’ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ‘అల వైకుంఠపురము’లోని ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ‘సామజ వరగమన’ పాట బాగా వైరల్‌ అయింది. ‘‘ఈ పాట యూట్యూబ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. సౌతిండియాలో ఒక పాటకు 100 మిలియన్‌ వ్యూస్‌ రావడం ఇదే తొలిసారి’’ అని చిత్రబృందం తెలిపింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here