సంక్రాంతి తర్వాత ప్రమోషన్స్‌: అనుష్క

0
5

హైదరాబాద్‌: తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో సంక్రాంతి పండగను జరుపుకొంటానని అగ్ర కథానాయిక అనుష్క తెలిపారు. ‘భాగమతి’ తర్వాత ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా జనవరి 31న విడుదల కాబోతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాధవన్‌, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 20 రోజుల మాత్రమే ఉంది. కానీ చిత్ర బృందం ఇప్పటి వరకు ప్రమోషన్‌ కార్యక్రమాల్ని ప్రారంభించలేదు. మరోపక్క కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అనుష్క మీడియాకు డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని వదంతులు వచ్చాయి.

కాగా సంక్రాంతి తర్వాత ప్రచారం ప్రారంభించబోతున్నట్లు అనుష్క చెప్పారు. ‘నిశ్శబ్దం’ సినిమా అప్‌డేట్‌ తెలుసుకోవడం కోసం స్వీటీ రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ స్టూడియోకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె మీడియా కంటపడ్డారు. ‘నిశ్శబ్దం’ ప్రమోషన్‌లో పాల్గొనరా? అని ప్రశ్నించగా.. ‘ఇంకా సమయం ఉంది. వచ్చే వారం నుంచి ప్రచారంలో పాల్గొంటాను’ అని అన్నారు. అనంతరం సంక్రాంతిని ఎలా జరుపుకోబోతున్నారు అని అడగగా.. ‘మా అమ్మానాన్నలతో కలిసి పండగను జరుపుకొంటా. అందుకే బెంగళూరుకు వెళ్తున్నా’ అని చెప్పారు.

సాత్విక, రామ్‌ నారాయణ్, సతీష్, శాంతి రావ్‌

అల్తాఫ్, శాంతిరావు, లావణ్యా రెడ్డి, సాత్విక జై ప్రధాన తారాగణంగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. సతీష్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం చిత్రీకరణ ముగిసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ–‘‘మామూలుగా పెద్ద వ్యక్తుల జీవితాలు బయోపిక్స్‌గా వెండితెరపైకి వస్తుంటాయి. కానీ మేమే ఒక సామాన్యవ్యక్తి కథనే బయోపిక్‌గా తెరకెక్కించాం. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ ఎవరూ చేశారనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం లేదు. కానీ అతను మాత్రం ఇండస్ట్రీకి మరో రాజేంద్రప్రసాద్‌ అవుతారని చెప్పగలను. నిర్మాత సతీష్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.

పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ‘‘నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టి సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేశాం. కథే హీరో అని నమ్మి చేసిన చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, వేసవి సందర్భంగా విడుదల చేయాలనుకుటున్నాం. ఈ సినిమా మా అందరికీ పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత సతీష్‌. ‘‘పెళ్లైన కొత్తలో కొత్తజంటకు ప్రతి రోజూ పండగలాగే ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుస్తుంది.. ముందుంది ముసళ్ల పండగ అని. ఈ అంశాన్నే సినిమాలో చూపించబోతున్నాం. మా చిత్రం ఈ ఏడాదిలో సర్‌ప్రైజ్‌ హిట్‌ అవుతుందని నమ్ముతున్నాం’’ అన్నారు నటుడు భద్రం. ఈ కార్యక్రమంలో శాంతిరావు, స్వాతి, కెమెరామ¯Œ  కర్ణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here