షూటింగ్‌ సమయంలో శర్వానంద్‌కు గాయం అవ్వడంతో మరోసారి ఆపరేషన్

0
40

Image result for sharwanand latest images

జాను సినిమా షూటింగ్ సమయంలో శర్వానంద్ భుజానికి గాయమైంది. దానికి ఆపరేషన్ అవసరం అయింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శర్వా భుజానికి ఆపరేషన్ అయింది. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత తిరిగి జాను సినిమా షూటింగ్లో పాల్గొని.. ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు. అయితే ఇప్పుడా గాయం తిరగబడినట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రస్తుతం అమెరికాలో ఉన్న శర్వా అక్కడే భుజానికి మరోసారి ఆపరేషన్ చేయించుకునేందుకు రెడీ అవుతున్నట్టు ప్రకటించారు.

ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జాను’ యావరేజ్ అనిపించుకుంది. ఈ చిత్రానికి మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. సమంత-శర్వానంద్‌ జంటగా నటించారు. దిల్ రాజు నిర్మించారు. `జాను` తరువాత శర్వానంద్ 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న `శ్రీకారం` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ తిరుపతి, హైదరాబాద్‌లలో జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here