వివాహం చేసుకున్న పరుగు హీరోయిన్‌

0
24

Image result for నటి షీలా

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పరుగు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి షీలా. గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా ఇటీవల వివాహం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ బిజినెస్‌ మ్యాన్‌ను ఆమె పరిణయమాడారు. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం వేడుకగా జరిగింది. ఈ మేరకు భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి తన అభిమానులతో పంచుకుంది. ‘ఈరోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం.. మా గుండె లోతుల్లోని సంతోషం.. మేమిద్దరం కలిసి నూతన జీవితం ఆరంభించే ఓ కొత్త రోజు’ అని షీలా పేర్కొన్నారు.

2006లో విడుదలైన ‘సీతాకోకా చిలుక’ సినిమాతో షీలా టాలీవుడ్‌ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాదిలో విడుదలైన ‘రాజుభాయ్‌’ సినిమాలో మంచు మనోజ్‌ సరసన ఆమె నటించారు. కాకపోతే ఆ రెండు సినిమాలు షీలాకు ఆశించిన గుర్తింపు, మంచి స్థాయిని అందించలేకపోయాయి. అనంతరం ఆమె 2008లో విడుదలైన ‘పరుగు’ సినిమాలో బన్నీ సరసన ఆడిపాడారు. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ‘పరుగు’ చిత్రం తర్వాత వరుసగా ఎన్టీఆర్‌, రామ్‌, బాలకృష్ణ చిత్రాల్లో షీలా నటించారు. 2011లో విడుదలైన ‘పరమ వీర చక్ర’ సినిమా తర్వాత షీలా టాలీవుడ్‌ తెరకు దూరంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here