విజయ్‌తో బైక్‌రైడ్‌ ఎంజాయ్‌ చేస్తున్న అనన్య

0
13

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యపాండే, టాలీవుడ్‌ యువ హీరో విజయ్‌ దేవరకొండతో బైక్‌రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇందులో విజయ్‌దేవరకొండకు జంటగా అనన్యపాండే నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా తాజాగా విజయ్‌-అనన్యలపై రాత్రి సమయంలో ముంబయి రోడ్లపై బైక్‌రైడ్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీకవడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు ‘ఇట్స్‌ టూ హాట్‌’, ‘క్యూట్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మొదటి పాన్‌ ఇండియన్‌ సినిమాగా ‘ఫైటర్‌’ తెరకెక్కుతోంది. యాక్షన్‌ ప్రధానాంశంగా ఓ ప్రేమ కథతో రూపొందిస్తున్న ఈసినిమా కోసం విజయ్‌ దేవరకొండ థాయ్‌లాండ్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని వచ్చారు. ఈ చిత్రంలో విజయ్‌ వినూత్నమైన గెటప్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాకి ఛార్మి, కరణ్‌జోహర్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here