వర్మ విడుదల చేసిన MMOF మూవీ ట్రైలర్

0
15

జేడీ. చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్‌నందన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం MMOF ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ట్రైలర్‌ చూశాక నేను స్లో అయ్యానా లేక సినిమా తీసిన వారు ఫాస్ట్‌గా ఉన్నారా? అనే అనుమానం కలిగింది. ట్రైలర్‌ కొత్తగా ఉంది. ఆడియన్స్‌కు సినిమా చూడాలి అనిపించేలా ఉంది. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుం టున్నట్టుగా ” చెప్పారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ “జేడీతో చాలా కాలం తర్వాత కలిసి నటించాను.MMOF సినిమా కొత్త కాన్సెప్ట్‌తో వస్తోంది” అని అన్నారు. శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ “వర్మలా సినిమాలు చేయాలని, అతడిని అనుకరించాలని చాలా మంది అనుకుంటారు కానీ అది అసాధ్యం. జేడీ చక్రవర్తి మేథా సంపత్తు ఉన్న నటుడు” అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్‌, ఛాయా గ్రహణం గరుడవేగ అంజి, మాటుల రాఘవ, నిర్మాతలు ఆర్‌ఆర్‌ఆర్‌ రాజశేఖర్‌, జేడీ. ఖాసీం, దర్శకత్వం యన్‌యస్‌సి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here