వరుణ్ తేజ్ సినిమాలో విలన్ గా నవీన్ చంద్ర?

0
21

ముకుంద, “కంచె”, లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 వంటి సినిమాలో నటించిన వరుణ్ తేజ్. తన కథల ఎంపికలో మొదటి నుండి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గతేడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో విజయాలను అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని బాక్సింగ్ నేపథ్యంలో చేయనుండడంతో ముంబై వెళ్లి ఏకంగా నాలుగు నెలలు బాక్సింగ్ లో శిక్షణ పొందాడు. బాడీను కూడా రోల్ కు తగ్గట్లుగా మలుచుకున్నాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ ను ఇటీవలే వైజాగ్ లో మొదలుపెట్టిన విషయం తెల్సిందే. జులైలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా చేసేదెవరో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత చిత్రంలో బాల్ రెడ్డి పాత్రలో జగపతి బాబు కొడుకుగా నటించిన నవీన్ చంద్ర ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఎవరు చిత్రంలో కూడా నవీన్ కు మంచి రోల్ దక్కింది. నవీన్ చంద్ర కూడా వరుణ్ సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అందుకోసమే 45 రోజులు బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు.ఈ రోల్ గురించి నవీన్ చంద్ర స్పందిస్తూ తన రోల్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయి కానీ అలా కనిపించదు.

చాలా భిన్నంగా నా పాత్రను తీర్చిదిద్దారు. నా కెరీర్ లో మరో ప్రత్యేకమైన సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది అని చెప్పాడు. ఏప్రిల్ నుండి నవీన్ చంద్రకు సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. వరుణ్ తేజ్ – నవీన్ చంద్ర మధ్య వచ్చే చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ కూడా చిత్రానికి కీలకమని చెబుతున్నారు. బాక్సింగ్ నేపధ్యమున్న సినిమానే అయినా ఎమోషనల్ కంటెంట్ బలంగా ఉంటుందని తెలుస్తోంది. సిద్ధూ ముద్ద, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here