వకీల్ సాబ్ పాట.. పెద్దగా లేదుగా

0
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ హంగామా మొదలైంది. ఈరోజు ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి ‘మగువా మగువా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ పాటకు మిశ్రమ స్పందన దక్కుతోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. థమన్ సూపర్ ఫామ్ లో ఉండడంతో పాటుగా తొలిసారి పవన్ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ సినిమా పాటలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మొదటి పాట మాత్రం యావరేజ్ మార్కులే తెచ్చుకుంది.మగువా మగువా పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ఈతరం యువతకు ఫేవరెట్ సింగర్ అయిన సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. ఈ మధ్య సిద్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ ‘మగువా మగువా’ పాట కూడా సంచలనం సృష్టించడం ఖాయమని పవర్ స్టార్ అభిమానులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ పాట సూపర్ అనే స్థాయిలో లేకపోవడంతో వారికి నిరాశ కలిగింది.

ఇక కొందరు పవన్ అభిమానులైతే థమన్ పై విరుచుకుపడుతున్నారు. బన్నీ సినిమాకు సూపర్ సాంగ్స్ ఇచ్చి ఇప్పుడు పవన్ సినిమా కు ఇలాంటి వీక్ సాంగ్ ఇస్తావా.. అంటూ థమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మిగతా పాటలకైనా క్యాచీగా ఉండేలా ట్యూన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఇదంతా థమన్ భయ్యా వింటున్నాడో లేదో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here