‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసిన నేషనల్ మీడియా

0
17

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ప్రేమను వ్యక్తం చేసే వారు కొందరైతే… ఆగ్రహం వ్యక్తం చేసే వారు మరికొందరు! మొత్తం మీద అతడిని ఎవరూ విస్మరించలేక పోతున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి జనసేనాని రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ ఇలా విడుదల అయిందో… లేదో… అలా ఆ లుక్ మీద డిస్కషన్లు స్టార్ట్ చేశారు. పవన్ అభిమానులకు ‘వకీల్ సాబ్’ లుక్ విపరీతంగా నచ్చింది. ఆ లుక్కును రాజకీయాలకు ముడిపెడుతూ… పవన్ గురించి గొప్పగా చెబుతూ సంబరపడుతున్నారు. అదే సమయంలో ఆ లుక్ జాతీయ మీడియాకు కోపం తెప్పించింది.

హిందీలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ చిత్రానికి ‘వకీల్ సాబ్’ రీమేక్. హిందీలో అమితాబ్ పోషించిన లాయర్ క్యారెక్టర్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. హిందీలో అమితాబ్ క్యారెక్టర్ హీరో అన్నట్టు ఉండదు. కథలో ఒక పాత్రగా మాత్రమే కనిపిస్తుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్, స్టార్ డమ్ కి తగినట్లుగా మార్పులు చేశారు.

‘పింక్’ చూసిన వాళ్ళకు… ఆ మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అయిపోతుంది. పవన్ ను బ్రాండ్ న్యూ స్టైలిష్ అవతార్ లో చూపించారు. ఈ మార్పులే జాతీయ జర్నలిస్టులకు కోపాన్ని తెప్పించాయి.

ముగ్గురు అమ్మాయిల కథను హీరో కోణంలో మార్చడం ఏంటి అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో అమ్మాయిల కు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ రాసింది. మరో ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నట్లు కథనం ప్రచురించింది. అటు ఇటు ఎటు చూసుకున్న పవన్ రీ ఎంట్రీ పెద్ద చర్చకు దారితీస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here