రొమాంటిక్‌ రైడ్‌

0
19
Ananya Panday Goes For A Bike Ride With Vijay Deverakonda - Sakshi

విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే

ముంబై వీధుల్లో బైక్‌పై రొమాంటిక్‌ రైడ్‌ను ఆస్వాదిస్తున్నారు విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే. ఇదంతా పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్న ‘ఫైటర్‌’ సినిమా కోసం. ఛార్మి, పూరి, కరణ్‌ జొహర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబై నగరంలో జరుగుతోంది. బైక్‌ రేసింగ్‌కి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బైక్‌పై అనన్యా పాండేతో రేస్‌లో పాల్గొన్నారు విజయ్‌. మరి రేస్‌ గెలిచారా? వేచి చూడాలి. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here