రూ.50 లక్షలు పెట్టి కథ కొన్న హీరో?

0
37

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని రూ.50 లక్షలు పెట్టి ఓ కథ కొన్నారట. ఆయన ఇటీవల తన కొత్త ప్రాజెక్టు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించబోతున్నారు. విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’తో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. మేలో సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతోందట. కాగా ఈ సినిమా కథను నాని రూ.50 లక్షలు పెట్టి కొన్నారని సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ఆడియో కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్‌ వద్ద ఆయన దీన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నానికి కథ బాగా నచ్చడంతో ఎక్కువ మొత్తం ఇచ్చి, తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే నాని స్పందించాల్సిందే.

ప్రస్తుతం నాని ‘వి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్‌బాబు మరో కథానాయకుడు. నివేదా థామస్‌, అదితిరావు హైదరి కథానాయికలు. మరోపక్క నాని, ‘నిన్నుకోరి’ ఫేం శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here