రాగల 24 గంటల్లో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

0
4

హాస్య ప్రధానమైన చిత్రాలను తీసే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.. రూట్ మార్చి క్రైమ్ థ్రిల్లర్‌ను పట్టాలెక్కించాడు. కావాల్సినంత అందం ఉండి ప్రతిభ పుష్కలంగా ఉన్నా సరైన అవకాశం రాక ఎదురు చూస్తున్న ఈషా రెబ్బా మెయిన్ లీడ్‌గా రాగల 24 గంటలు చిత్రం తెరకెక్కింది. చాలా కాలం తరువాత తెలుగులో ఓ కీలక పాత్రను పోషించాడు శ్రీరామ్. మరి వీరందరికీ ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందించిందా? లేదా? అన్నది చూద్దాం.

కథమేఘన (ముస్కాన్ సేథ్) అనే అమ్మాయిని దారుణంగా మానభంగం చేసిన కేసులో పునిత్, వినీత్, అద్విత్ అనే ముగ్గురిని ఏసీపీ నరసింహా (శ్రీరామ్) అరెస్ట్ చేస్తాడు. ఒకరోజు ఈ ముగ్గురు జైలు నుంచి తప్పించుకుంటారు. అలా పారిపోతూ.. ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్(సత్య దేవ్) ఇంట్లోకి చొరబడతారు. అయితే అప్పటికే ఆ ఇంట్లో రాహుల్ భార్య విద్య (ఈషారెబ్బా) ఒంటరిగా ఉంటుంది. తన భర్తను తానే చంపినట్టు కథ మొత్తం ఆ ముగ్గురికి చెబుతుంది. తన స్నేహితుడు గణేష్ రాహుల్‌ను హత్య చేసి ఉంటాడన్న అనుమానంతో ఆ నేరం తనపై వేసుకుంటుంది. అయితే గణేష్ ఆ హత్య చేయలేదని విద్యకు తెలుస్తుంది? రాహుల్‌ను ఎవరు హత్య చేశారు? ఆ హత్య వెనుక ఉన్న నేపథ్యం ఏంటి అన్నదే కథ.

కథలో ట్విస్ట్‌లుజైలు నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురికి రాహుల్‌కు ఉన్న సంబంధం ఏంటి? మేఘన అనే అమ్మాయిని చంపింది ఎవరు? ఆ ముగ్గురికి ఆ అమ్మాయికి మధ్య ఉన్న బంధం ఏంటి? ఏసీపీ, రాహుల్‌కు ఉన్న సంబంధం ఏంటి? లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

ఫస్టాఫ్ అనాలిసిస్..ముగ్గురు నేరస్తులు పారిపోవడం, విద్య ఇంట్లోకి చొరబడటం, అప్పటికే అతను హత్యకు గురవడం లాంటి అంశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. బెస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్‌ అయిన రాహుల్ అనాథాశ్రమంలో పెరిగిన విద్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం లాంటి సీన్స్‌తో కథనాన్ని ముందుకు తీసుకెళ్లడం బాగానే అనిపిస్తుంది. ఇక అలా ముందుకు సాగుతున్న కొద్దీ రాహుల్ పైశాచికత్వం బయటపడటం, విద్య కుంగిపోవడం లాంటి అంశాలతో థ్రిల్లర్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ఏమాత్రం అనిపించదు. మధ్యలో విద్య స్నేహితుడు గణేష్ (గణేష్ వెంకట్రామ్) ఎంటర్ అవ్వడం, భార్యభర్తల మధ్య గొడవలు పెరగడం, ఆ గొడవలో తాను తన భర్తను చంపినట్టు ఆ ముగ్గురికి చెప్పడం లాంటి సీన్స్‌తో పర్వాలేదనినిపిస్తుంది. దాని వెనుక ఉన్న కథ ఏంటి? అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో ఫస్టాఫ్ ఒకే అనిపిస్తుంది.

సెకండాఫ్ అనాలిసిస్..ఫస్టాఫ్‌లో స్టోరీని చూసిన ప్రేక్షకుడు ద్వితీయార్థానికి ఏదో ఊహించుకుంటాడు. అయితే అక్కడే కథనం గమనం తప్పినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు విలన్లుగా చూపించిన పునిత్, వినీత్, అద్విత్‌లను సాఫ్ట్ క్యారెక్టర్స్‌గా చూపించడం, మేఘన అనే అమ్మాయితో వారు స్నేహంగా ఉండటం, వారందరికీ ఓ సాంగ్‌ను పెట్టడం లాంటివి ప్రేక్షకులకు మింగుడు పడదేమోనని అనిపిస్తుంది. అప్పటి వరకు ప్రేక్షకుడు ఎన్నో అనుమానాలతో అలా జరిగి ఉంటుంది.. ఇలా అయి ఉంటుంది.. అని ఏవేవో లెక్కలు వేసుకుంటుంటే.. మళ్లీ రొటీన్ కథకు వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. చివరకు తమకు అన్యాయం చేసిన వారిని ఆ ముగ్గురు కలిసి మట్టుబెట్టడంతో ఎండ్ కార్డ్ పడుతుంది. అయితే సెకండాఫ్‌ను ఇంకాస్త ఎంగేజింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేదేమోన్నన్న ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు..ఈ చిత్రంలో రాహుల్ పాత్రలో నటించిన సత్య దేవ్ డిస్టింక్షన్‌లో పాసయ్యాడనిపిస్తుంది. శ్యాడిజంలోనూ వేరియేషన్స్ చూపిస్తూ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. రాహుల్ పాత్రతో సత్య దేవ్ మరోసారి తనలోని ప్రతిభను నిరూపించుకున్నాడు. అందరీ కంటే ఎక్కువ మార్కులు పడేది సత్యదేవ్‌కే. ఆపై క్యూట్ లుక్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది ఈషా రెబ్బా. స్క్రీన్‌పై కనిపించినంత సేపు అందంగా కనిపించింది. చాలా కాలం తరువాత తెలుగులో నటించిన శ్రీరామ్‌కు మంచి పాత్రే పడిందని చెప్పవచ్చు. రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో శ్రీరామ్ అద్భుతంగా నటించాడు. ముస్కాన్ కనిపించింది కొద్దిసేపే అయినా ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది. ఇక మిగతా పాత్రల్లో రవి వర్మ, అధిరే అభి, గణేష్, లాంటి వారు తమ పరిధి మేరకు నటించారు.

దర్శకుడి పనితీరుహాస్య చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు.. మొదటిసారి రూటు మార్చి థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. అయితే థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్నాడే తప్పా.. ప్రేక్షకుడిని సీటు అంచును కూర్చోబెట్టగలిగే కథనాన్ని అల్లుకోలేకపోయాడనిపిస్తుంది. కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకుడి సహానానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఆ ముగ్గురి ఫ్లాష్ బ్యాక్‌ను కూడా ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఏదో ఉంటుందని ఆశపడ్డ ప్రేక్షకుడికి నిరాశనే మిగిల్చాడని చెప్పవచ్చు. పేరుకు థ్రిల్లర్ సినిమా అని చెప్పినా ఆ ఇంటెన్సిటీ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం పెద్ద మైనస్‌గా మారవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు..థ్రిల్లర్ సినిమాలకు ముఖ్యంగా కావాల్సింది సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీకి ఈ రెండూ బాగా కలిసి వచ్చాయి. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో ఆసక్తికరంగా మలిచాడు మ్యూజిక్ డైరెక్టర్. ప్రతీ ఫ్రేమ్‌లో నటీనటులను అందంగా చూపించడమే కాకుండా.. థ్రిల్లర్ జానర్‌కు కావాల్సినట్టుగా తన కెమెరా పని తనాన్ని చూపించాడు. సినిమాలోని డైలాగ్‌లు కూడా ఏమంత ప్రభావం చూపించవు. ఇక ఎడిటింగ్ విభాగం ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు, ఆర్ట్ విభాగం పనితీరు అన్నీ సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ఫైనల్..థ్రిల్లర్ జానర్‌ అని ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులను నిరాశ పరిచేలా ఉన్నా.. ఓవరాల్‌గా ఓకే అనిపిస్తుంది.

బలం, బలహీనతలుప్లస్ పాయింట్స్
సత్యదేవ్, ఈషారెబ్బ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్
కథ
ఆసక్తికరంగా లేని కథనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here