రష్మికకు మైండ్ బ్లాంకయ్యే వరుస స్ట్రోక్స్!

0
21
`గీత గోవిందం` తర్వాత తెలుగులో స్టార్ స్టాటస్ కి ఎదిగింది రష్మిక మందన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుందీ కన్నడ భామ. ఈ క్రేజ్ ని తెలివిగానే క్యాష్ చేసుకుంటోంది. దర్శకనిర్మాతలు రష్మిక క్రేజును ఎన్ క్యాష్ చేసుకుంటున్న సంగతి చూస్తున్నదే. ఇటీవల సరిలేరు నీకెవ్వరు- భీష్మ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో ఓ ఫన్నీ రోల్ లో నటించింది. అయితే రష్మిక పాత్రపై క్రిటిక్స్ నుంచి విమర్శలు వచ్చాయి. చాలా సిల్లీగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. భీష్మలో ఓ మంచి పాత్రలో తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది. అయితే తనకున్న క్రేజ్ దృష్ట్యా రష్మికకు తమిళంలోనూ ఆఫర్స్ క్యూ కట్టాయి. కోలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ అన్నదమ్ములు కార్తీ- సూర్యలతో కలిసి నటించే అవకాశాలను అందుకుంది. కార్తితో సుల్తాన్ చిత్రంలో నటిస్తోంది. సూర్యతోనూ ఓ సినిమాకు కమిటైంది. హరి దర్శకత్వంలో సూర్య నటించే సినిమాలో హీరోయిన్ గా రష్మికని ఎంపిక చేసినట్టు గతంలో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. రష్మిక క్రేజ్ కి స్టార్స్ తో అవకాశాలు క్యూ కడుతున్నాయని అందరు అనుకున్నారు. కానీ తాజా పరిణామం రష్మికకి దిమ్మ దిరిగే షాక్ ఇచ్చింది. ఓ రకంగా సూర్య ఆమెకి ఈ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు.

హరి దర్శకత్వంలో ఆయన నటించే సినిమాలో హీరోయిన్ గా రష్మిక స్థానంలో మాళవిక మోహనన్ ని ఫైనల్ చేశారట. దీంతో విషయం తెలిసి రష్మిక షాక్ కి గురైందని తెలిసింది. సూర్య వంటి పెద్ద స్టార్ సినిమాలో ఛాన్స్ మిస్ కావడంతో గీత గోవిందం బ్యూటీకి మైండ్ బ్లాంక్ అయిపోయిందట! త్రివిక్రమ్- ఎన్టీఆర్ సినిమాలో కూడా మొదట రష్మిక పేరు వినిపించింది. ఆ తర్వాత పూజాని ఫైనల్ చేయడంతో రష్మికకు పెద్ద జోల్ట్ తగిలిందనే చెప్పాలి. ఎన్టీఆర్.. ఆ తర్వాత సూర్యతోనూ క్రేజీ అవకాశాలను మిస్ చేసుకుంది పాపం.

ప్రస్తుతం కార్తితో `సుల్తాన్` సినిమా చేస్తోంది. అలాగే కన్నడ లో `పోగరు` అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో ధృవ సార్జా హీరో. ఇక తెలుగులో రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ఓ సినిమా చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ సినిమా ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here