రజనీకాంత్ కు విలన్ గా మారిన తెలుగు హీరో ..

0
28

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ గత కొంతకాలంగా హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో సిటిమార్ సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. కాగా తాజాగా గోపీచంద్ కు రజనీకాంత్ మూవీ లో నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. కాకపోతే అది హీరోగా కాదు విలన్ రోల్ అట.

రజినీకాంత్ తో కలిసి నయనతార శివ దర్శకత్వం లో అన్నాతై ( తెలుగులో పెద్దన్నయ్య ) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను సన్ పిచర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా లో గోపి విలన్ గా నటిస్తున్నాడట. గోపీచంద్ కెరియర్ మొదట్లో జయం , నిజం సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. కానీ ఇప్పుడు హీరోగా సక్సెస్ కాలేకపోతుండడం తో మళ్లీ విలన్ రోల్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here