మొన్నటి వరకు మహేష్ బాబు.. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్..!

0
11

Image result for pavan,mahesh latest images

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క తన జనసేన పార్టీ పనులు చూసుకుంటూనే మరోపక్క వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్లో పెట్టేసాడు. ప్రస్తుతం చేస్తున్న ‘వకీల్ సాబ్’ తో పాటు.. క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలు చేస్తుండగానే… తరువాత చేయబోయే సినిమాల కోసం కూడా కథలు వింటున్నాడు. ఈ లిస్ట్ లో ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి అలాగే త్రివిక్రమ్, పూరిజగన్నాథ్ లు కూడా ఉన్నారు.

అయితే ఎక్కువ అవకాశాలు పూరి జగన్నాథ్ కే ఉన్నాయట. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న పూరి.. తరువాతి సినిమాని పవన్ తో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. పూరి ‘జన గణ మన’ అనే కథ రాసుకుని హీరో కోసం వెతుకులాట మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. మొదట మహేష్ తో చెయ్యాలనుకున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. తరువాత ప్రభాస్ అలాగే ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ లను కూడా సంప్రదించాడు. కానీ ప్రస్తుతం వాళ్ళు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదట. దీంతో పవన్ ను సంప్రదించాడు. పూరి ఫాస్ట్ సినిమాలు తెరకెక్కిస్తాడు కాబట్టి.. అందులోనూ పవన్ కు కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడట. ఈ కథ ప్రకారం పవన్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడట. వింటుంటేనే పవన్ ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది కదూ..! ‘భరత్ అనే నేను’ సినిమా టైములో కూడా పవన్ కళ్యాణ్ కూడా సి.యం లా కనిపిస్తే బాగుణ్ణు అంటూ పవన్ అభిమానులే కాదు చాలా మంది ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్.. ఓకే అయ్యి సెట్స్ పైకి వెళితే వాళ్ళకి ఫీస్ట్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here