మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం – షాక్ లో ఉన్న ఫ్యాన్స్‌..?

0
34

Image result for chiru latest images

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబందించిన చిత్రీకరణ కూడా హైదరాబాద్ శివార్లలో జరుగనుంది. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లోకరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న మధ్యలో అత్యంత భయంకరంగా విజృంభిస్తున్న కారణంగా ఈ నెల 31 వరకు తెలంగాణా రాష్ట్రంలోని స్కూళ్లు, థియేటర్లు, మాల్స్‌ను మూసివేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా సమర్ధించారు. అంతేకాకుండా ఈ మేరకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని వాఖ్యానించిన ఆయన, తన సినిమా షూటింగ్ ని కూడా తక్షణమే ఆపేసి 15 రోజులు వాయిదా వేస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు. కాగా ఈ కరోనా వైరస్ వ్యాపించకుండా ఏపీ ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని, మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రకటించారు. అంతేకాకుండా ఈ మహమ్మారి భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ప్రజలు ఒక దగ్గర గుమికూడకుండా క్రీడల్ని వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్‌ని మూసివేయడం, స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవ్వడం లాంటి చర్యలు ఎంతో ముఖ్యమైనవి అని చిరంజీవి పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here