మెగాస్టార్ అక్కడికి వెళ్ళాలి అంటే భయపడిపోయేవాడట… ఎందుకో తెలుసా?

0
24

మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలోకి వచ్చి చాలాకాలం అయ్యింది. 151 సినిమాలు పూర్తి చేశారు. 152 వ సినిమా చేస్తున్నారు. ఇది ముల్టీస్టారర్ సినిమా. ఇందులో మహేష్ బాబు గెస్ట్ పాత్ర చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సినిమా విషయంలో చిరంజీవి పక్కా క్లారిటీగా ఉంటాడు. సినిమా చేస్తున్నంత సేపు దానిమీద ద్వాస తప్పించి మరోదానిపై ఉండదు. అందుకే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.

ఇక ఇదిలా ఉంటె, మెగాస్టార్ చిరంజీవి చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ చేసే రోజుల్లో ఓ బజారుకు మాత్రం వెళ్ళేవాడు కాదట. అలా అక్కడికి వెళ్ళాలి అంటే భయపడిపోయేవాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అక్కడికి వచ్చే వారిలో చాలామంది నెగెటివ్ ఆలోచనతో వస్తుంటారట. సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమాల్లో జరిగే విషయాల గురించి తప్పుగా మాట్లాడుకుంటారు.

తప్పుడుగా మాట్లాడుకోవడమే కాకుండా నెగెటివ్ గా ప్రచారం చేస్తూ అవకాశాలు రావని, జీవితం ఇబ్బందుల్లో పడిపోతుందని చెప్తూ ప్రచారం చేస్తుంటారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఆ బజార్ ఏదో కాదు… పాండి బజార్. చైన్నై చాలా ఫేమస్. అవకాశాల కోసం చెన్నై వచ్చిన చాలామంది పాండి బజార్ లోనే మకాం వేస్తారు. ఓసారి మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. దేనికోసమో పాండి బజార్ కు వెళ్ళాడు. అక్కడ మెగాస్టార్ ను సినిమాల్లో చేయడానికి వచ్చారా అని అడిగారట.

దానికి అవునని చెప్పగా, అవకాశాలు రావని, ఎందుకు వచ్చావని నానా మాటలు అన్నట్టు మెగాస్టార్ పేర్కొన్నారు. కొన్ని రోజులు మనసు బాధపడిందని కానీ, ఎవరో అన్న మాటలు ఎందుకు పట్టించుకోవాలి అని చెప్పి మనసుకు సర్ది చెప్పుకున్నట్టుగా మెగాస్టార్ పేర్కొన్నారు. ఒక పని చేసే సమయంలో వ్యతిరేకించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారని, కానీ, వారిని ఎదిరించి ముందుకు ముందుకు పోవాలని, వెనక్కి అడుగువేస్తే లైఫ్ ఇబ్బందుల్లో పడుతుందని మెగాస్టార్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here