ముద్దు సీన్ ఆ హీరో తో అయితే ఓకె అంట

0
16

హీరోయిన్స్ గా 15 ఏళ్ళు ఘంటాపధంగా ఛాన్స్ లు చేజిక్కించుకుంటూ.. ఇప్పటికి హీరోయిన్ గా బిజీగా వున్నా తమన్నా మీద ఈమధ్యన పెళ్లి రూమర్స్ చాలానే వచ్చాయి. తమన్నా కి ఆఫర్స్ తగ్గాయి, కెరీర్ లో చూడాల్సిన ఎత్తుపల్లాలు చూసేసింది.. ఇక త్వరలోనే తమన్నా పెళ్ళికి సిద్దమంటూ వార్తలొచ్చాయి. కానీ తమన్నా మాత్రం పెళ్లి విషయం ఎత్తగానే సిగ్గుపడకుండా.. తానిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పింది. ఇంకా సినిమాలు చెయ్యాలి అంటున్న తమన్నాని ఓ మీడియా ప్రతినిధి మీరు గనక పెళ్లి కోసం స్వయంవరంలో పాల్గొంటే ఆ స్వయం వారానికి ఏ హీరోలు రావాలనుకుంటారో అందులో ముగ్గురు పేర్లు చెప్పమనగానే తమన్నా టక్కున బాహుబలి ప్రభాస్, బాలీవుడ్ నటులు హ్రితిక్ రోషన్, విక్కీ కౌశల్ పేర్లు చెప్పేసింది.

మరి బాహుబలి ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పకనే చెప్పిన తమన్నా తనకు ముద్దు సీన్ లో నటించాలంటే అది కేవలం ఒక్క హీరో సినిమాలోనే అది.. కూడా హ్రితిక్ రోషన్ సినిమాలో అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఒక్క ముద్దు సీన్ లో కూడా తమన్నా నటించలేదట. సినిమా కథ విన్నప్పుడే డైరెక్టర్ కి తమన్నా తన కండిషన్స్ వినిపిస్తుందట. హాట్ గా కనబడమంటే ఓకె కానీ.. ముద్దు సీన్స్ కి నై అంటుందట. ఇక కేవలం ఆ ముద్దు సీన్స్ ని హ్రితిక్ రోషన్ సినిమా కోసం తన నియమాన్ని ఉల్లంగిస్తా అని. హ్రితిక్ రోషన్ అనగానే ముద్దు సీన్స్ కి కూడా సై అంటా అంటుంది తమన్నా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here