ముగిసిన మల్లన్న జాతర

0
18

ఇచ్చోడ:అగ్నిగుండం ప్రవేశానికి బారులు తీరిన భక్తులు, ఏడు రోజులుగా మల్లికార్జుని సేవలో తరించిన శివభక్తులు, మల్లన్న ఆలయ కమిటీ వారు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంతో జాతరకు ముగింపు పలికారు. మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయ జాతర సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారులు, భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. వీరభద్రుడి ప్రభలతో మల్లన్న శరణుగోషలతో డప్పులు, భాజాలతో తరలివచ్చి నృత్యాలు చేశార. అగ్నిగుండాల కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గురువారం రాత్రి మల్లికార్జున స్వామి విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. చివరి రోజున మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. కోడెమొక్కలు, తలనీలాలు, నిలువెత్తు బెల్లం స్వామివారికి సమర్పించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here