మిస్ మ్యాచ్.. రీలీజ్ డేట్ ఫిక్స్

0
6

ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్న చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఎన్‌వి. నిర్మల్‌కుమార్‌ దర్శకుడు. అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌, ఎల్‌ఎల్‌పి సంస్థలు నిర్మిసున్నా యి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసు కున్న మిస్‌ మ్యాచ్‌ విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్‌ 6న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌ తెలిపారు.
సెన్సార్‌ యు సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను సైరా ఫేమ్‌ సురేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ “టైటిల్‌ ఆకట్టుకునేవిధంగా ఉంది. హీరో ఉదయ్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. కథ అందించిన భూపతిగారికి, దర్శకుడు నిర్మల్‌ గారికి ఈ సినిమా మంచి సక్సెస్‌ ఇవ్వాలి” అని అన్నారు. రచయిత భూపతిరాజా మాట్లాడుతూ “మిస్‌ మ్యాచ్‌ ఇంటరెస్టింగ్‌గా ఉండబోతోంది. రెండు కుటుంబాల మధ్య జరిగే కథను దర్శకుడు బాగా చూపించారని, కుుటంబం అంతా కలిసి చూసే సినిమా” అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు గిప్టన్‌ మాట్లాడుతూ “అందరికీ నచ్చే పాటలు ఈ సినిమాలో ఉన్నాయి” అని చెప్పారు.
దర్శకుడు నిర్మల్‌ మాట్లాడుతూ “తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్‌ అన్నీ ఈ సినిమాకు ఉన్నాయి” అని చెప్పారు. చిత్ర నిర్మాత జి.శ్రీరామ్‌ రాజు మాట్లాడుతూ “ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి పనిచేశారు. ఉదయ్‌, ఐశ్వర్య కెమిస్ట్రీ బాగా కుదిరింది” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here