మా ప్రేమకు ఎలాంటి సమస్య లేదు: హీరోయిన్‌

0
5

మా ప్రేమకు ఎలాంటి సమస్య లేదు: హీరోయిన్‌

Kalyani Priyadarshan Says She Is In Love Will Marry Him For Sure - Sakshi

 చెన్నై : నటుడి కొడుకు ప్రేమలో… నటి కూతురు అనగానే ఇదేదో సినిమా టైటిల్‌ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ‘తప్పు’లో కాలేసినట్లే. ప్రేమ అన్నది ఎవరికి? ఎప్పుడు? ఎలా? ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం. ఎక్కడో? ఏదో సందర్భంలో? అనుకోకుండా కలిగేదే ప్రేమ. అయితే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య కూడా ప్రేమ కలగవచ్చు. అలాంటిదే నటి కల్యాణి ప్రేమ కూడా అనే ప్రచారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హల్‌చల్‌ చేస్తోంది. సంచలన సినీ జంట దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురు కల్యాణి అన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నది రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇటీవలే చిత్రలహరి సినిమాతో మంచి హిట్‌ కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇక తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా ‘హీరో’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది.

కాగా కల్యాణి ఇప్పుడు ప్రేమలో మునిగిపోయిందన్న ప్రచారం హోరెత్తుతోంది. ఈ బ్యూటీ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కొడుకు ప్రణవ్‌తో ప్రేమలో పడిందట. మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్‌ కళాశాల రోజుల నుంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏకంగా 43 చిత్రాలు వచ్చాయి. ఇది ఒక రికార్డు.  అంతే కాదు మోహన్‌లాల్, ప్రియదర్శన్‌ కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మోహన్‌లాల్‌ కొడుకు ప్రణవ్, ప్రియదర్శన్‌ కూతురు కల్యాణిల మధ్య బాల్యం నుంచే స్నేహం కొనసాగుతూ వచ్చింది. అది ఇప్పుడు ప్రేమగా మారిందనే  టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది.  ప్రస్తుతం ప్రణవ్‌, కల్యాణి తమ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారం గురించిన ప్రశ్నకు నటి కల్యాణి స్పందిస్తూ చాలా తెలివిగా బదులిచ్చింది. ‘నేను ఒకరిని ప్రేమిస్తున్న మాట నిజం. భవిష్యత్‌లో అతన్నే పెళ్లి చేసుకుంటాను. నేను ఎవరిని ప్రేమిస్తున్నానన్న విషయం నా కుటుంబసభ్యులకు తెలుసు. మా ప్రేమకు ఎలాంటి సమస్య లేదు. నేను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు, వివరాలను ప్రస్తుతానికి చెప్పను’ అని కల్యాణి పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here