భారీ పీరియ‌డ్ డ్రామా చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్

0
2

భారీ పీరియ‌డ్ డ్రామా చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన భారీ పీరియ‌డ్ డ్రామా మ‌మాంగం. ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి కేర‌ళ సంప్రాదాయ యుద్ధ‌వీరుడిగా క‌నిపించ‌నున్నారు. 17వ శ‌తాబ్ధం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇద్ద‌రు ద‌ర్శ‌కులు తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ సంజీవ్ పిళ్ళై ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, రెండో షెడ్యూల్ ఎం ప‌ద్మ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. భరతాపుళ ఒడ్డున పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఐకానిక్ పండుగ నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. ప్రాచీ తెహ్లన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఉన్ని ముకుందన్‌, అను సితార, మాళవికా మీనన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో మ‌మ్ముట్టి, ఉన్ని ముకుందన్ చేసే క‌త్తి విన్యాసాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ప‌లు భాష‌ల‌లో చిత్రాన్ని న‌వంబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా అభిమానుల‌లో భారీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here