బిగ్ బాస్ 4: ఆ ఇద్దరిలో ఎవరు హోస్టు?

0
18
Image result for maheshbabu,nagarjuna images
బిగ్ బాస్ 4 సీజన్ ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సీజన్ 4 కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారనే విషయంలో సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటి సీజన్ లో ఎన్టీఆర్.. రెండవ సీజన్లో నాని.. మూడవ సీజన్లో నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. అయితే ఈసారి నాలుగవ సీజన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి.అయితే ఇవన్నీ గాసిప్పులేనని మహేష్ క్యాంప్ సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు. మహేష్ ఇలాంటి షోలు చేయడం పట్ల ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు. మహేష్ రిజర్వుడుగా ఉండే వ్యక్తి కావడంతో ఇలాంటి షోలకు న్యాయం చేయలేననే అభిప్రాయం ఉందట. అంతే కాకుండా మహేష్ బాబును బిగ్ బాస్ నిర్వాహకులు ఇంతవరకూ సంప్రదించలేదని అంటున్నారు. ఇది మహేష్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశమే. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగులో ఎన్టీఆర్ కు తప్ప మిగతా హోస్టులు ఎవరికీ మంచి మార్కులు పడలేదు. ఇలాంటి సమయంలో మహేష్ హోస్ట్ గా చేయడం రిస్క్ అనేది ఎక్కువ మంది అభిమానుల అభిప్రాయం.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ 4 వ సీజన్ కు అక్కినేని నాగార్జునను హోస్ట్ గా కొనసాగించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే నాగార్జున మూడవ సీజన్ కు హోస్టుగా వ్యవహరించారు కాబట్టి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here