బాలీవుడ్‌కి విఠల్‌వాడి

0
3
vital vadi movie pre release shortly - Sakshi

సుధా రావత్, రోహిత్‌

రోహిత్, సుధా రావత్‌ జంటగా నాగేందర్‌.టి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విఠల్‌వాడి’. జి.నరేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులకు ‘విఠల్‌వాడి’ ప్రివ్యూ చూపించారు. జి.నరేష్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రమిది. ఇందులో రొమాంటిక్‌ సీ¯Œ ్స, సెంటిమెంట్‌ సీ¯Œ ్స కూడా బాగున్నాయి. యాక్షన్, సెంటిమెంట్స్‌ సీన్స్‌కి అందరూ కనెక్ట్‌ అయ్యారు.

మా చిత్రం ప్రివ్యూ చూసిన ప్రముఖులు సినిమా చాలా బాగుందని, రోషన్‌ కోటి సంగీతం వినసొంపుగా ఉందని యూనిట్‌ని అభినందించారు. హిందీలో ఒక ప్రముఖ నటుడి కొడుకుని లాంచ్‌ చెయ్యడానికి హిందీ రీమేక్‌ రైట్స్‌ కోసం ఆసక్తి చూపుతున్నారని గురుదేవ్‌ పిక్చర్స్‌ అధినేత ప్రమోద్‌ కుమార్‌ చెప్పడం సంతోషం. ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ప్రీ రిలీజ్‌ వేడుక జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ అడపా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here