బాలయ్య సినిమాలో ‘జబర్దస్త్’ కమెడియన్స్

0
2
‘వినయ విధేయ రామ’ తరువాత బోయపాటి శ్రీను ఒక పవర్ఫుల్ కథపై కసరత్తు చేస్తూ వున్నాడు. ఈ నెలలోనే బాలకృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ పాత్రలో రోజా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా పాత్రల ఎంపికపై బోయపాటి దృష్టిపెట్టినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో కామెడీకి సంబంధించిన ఎపిసోడ్స్ కోసం, ‘జబర్దస్త్’ ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ ను తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి వున్నాడని అంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ చివరివారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. గతంలో బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఘన విజయాలను అందుకోవడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here