బాలయ్య – బోయపాటి సినిమా షూటింగ్ షురూ..

0
22

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రస్తుతం బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘రూలర్’ గా వచ్చిన బాలయ్య అభిమానులను నిరాశపరిచింది. కాగా గతంలో బాలయ్య , బోయపాటి తో కలిసి సింహ, లెజండ్ సినిమాలుతెరకెక్కించగా ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ భారీ విజయాలను అందుకున్నాయి . ఈ సారి కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు నేడు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణను మొదలుపెట్టారు. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. బాలయ్య ఫైట్ చేస్తున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ ను వారం పాటు చిత్రీకరించనున్నారు. దీనికి రామ్ – లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తర్వాత అనంతపూర్ లో షూటింగ్ కొనసాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. ఒక గెటప్ లో స్టైలిష్ గా ఉంటే మరొక గెటప్ లో అఘోర లుక్ లో కనిపిస్తాడు.శరవేగంగా ఎటువంటి బ్రేకులు లేకుండా చిత్రీకరణను పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా అంజలి శ్రియ నటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here