బతుకమ్మ సంబరాలు షురూ..

0
10

నల్లగొండ: తెలంగాణ ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకునే ప్రకృతి పూల పండుగైన బతుకమ్మ సంబరాలు షురూ అయ్యాయి. బుధవారం నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్శహించారు. వివిధ కళాశాలలకు చెందిన విధ్యార్ధినులు పెద్ధసంఖ్యలో హాజరై బతుకమ్మ ఆటాపాటా పాడారు. ముఖ్య అతిధిగా హాజరైన యువత తెలంగాణ పార్టీ రాష్ట్ర్ర నాయకురాలు రాణి రుద్రమదేవి మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను నల్లగొండలో ఈ ఏడాది మొట్టమొదటి ఆడుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఐబీసీ డైరెక్టర్ ఏచూరి శైలజ, బతుకమ్మ సంబరాల కన్వీనర్ మాదగోని అక్షయ, కోకన్వీనరు కొడదల ఝాన్సీ, భీమనపల్లి శైలజ, శేషశ్రీ, అర్పిత, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహా రెడ్డి, నాయకులు జితేంద్రకుమార్, గోలి మధుసూదన్ రెడ్డిలు హాజరై విధ్యార్ధినులకు అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here