‘బందోబ‌స్త్‌’ మూవీ రివ్యూ

0
17

‘బందోబ‌స్త్‌’ మూవీ రివ్యూ

చిత్రం: బందోబ‌స్త్‌
నిర్మాణ సంస్థ‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: సూర్య‌, మోహ‌న్‌లాల్‌, ఆర్య‌, స‌యేషా సైగ‌ల్‌, స‌ముద్ర‌ఖ‌ని, పూర్ణ‌, నాగినీడు త‌దిత‌రులు
రైట‌ర్స్‌: పి.కె.పి, శ్రీరామ‌కృష్ణ‌
పాట‌లు: వ‌న‌మాలి, చంద్ర‌బోస్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: డి.ఆర్‌.కె.కిర‌ణ్
ఎడిట‌ర్‌: ఆంటోని
స్టంట్స్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, పీట‌ర్ హెయిన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.ఎస్‌.ప్ర‌భు
సంగీతం: హేరీష్ జైరాజ్‌
నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: కె.వి.ఆనంద్‌
త‌మిళ హీరో సూర్య పేరు విన‌గానే తెలుగు ప్రేక్ష‌కుడికి గుర్తుకొచ్చే చిత్రం `గ‌జినీ`, `సింగం` సిరీస్ చిత్రాలే. ఈ చిత్రాల‌తో త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ సూర్య‌కి మార్కెట్ క్రియేట్ అయ్యింది. అయితే త‌ర్వాత సూర్య చేసిన సినిమాలేవీ ఆయ‌న‌కు ఆశించిన స్థాయిలో విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాయి. అయితే సూర్య మాత్రం త‌న సినిమాల‌న్నింటినీ త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల చేస్తూ వస్తున్నారు. ఆ క్ర‌మంలో సూర్య‌, కె.వి.ఆనంద్‌తో చేసిన `కాప్పాన్‌` చిత్రాన్ని తెలుగులో `బందోబ‌స్త్‌` పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కంటే ముందే కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `వీడొక్క‌డే`, `బ్ర‌ద‌ర్స్` చిత్రాలు చేశారు. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఆర్య‌, స‌యేషా సైగ‌ల్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రి కాప్పాన్ త‌మిళంతో పాటు తెలుగులోనూ సూర్య‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….
క‌థ‌:
 పాకిస్థాన్‌లోని కెమిక‌ల్ వెప‌న్స్‌ను ధ్వంసం చేసిన మిల‌ట‌రీ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ ర‌వికాంత్‌(సూర్య) అక్కడి నుంచి త‌ప్పించుకుని ఇండియా చేరుకుంటాడు. ఓ ఆంధ్ర ప్రాంతంలో ఉండి.. సీక్రెట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి అక్క‌డ నుంచి ప్ర‌ధాని చంద్ర‌కాంత్‌(మోహ‌న్‌లాల్‌)ను కాపాడే మిష‌న్ మీద లండ‌న్ వెళ‌తాడు. ఎటాక్ నుండి ప్ర‌ధానిని కాపాడుతాడు. ప్ర‌ధాని పి.ఎ అంజ‌లి(స‌యేషా సైగ‌ల్‌) కూడా ర‌వికాంత్ ప్రధానిని చంప‌డానికి వ‌చ్చిన టెర్ర‌రిస్ట్ అనుకుని త‌ప్పుగా అర్థం చేసుకుంటుంది. నిజం తెలిశాక అత‌డిని ప్రేమించ‌డం మొద‌లు పెడుతుంది. చంద్ర‌కాంత్‌కి రవికాంత్ న‌చ్చ‌డంతో అత‌డిని త‌న ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా నియ‌మించుకుంటాడు. అప్ప‌టికే ర‌వి టీమ్‌తో ఉన్న జోసెఫ్(స‌ముద్ర‌ఖ‌ని) కూడా ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా ఉంటాడు. ఇద్ద‌రూ మంచి స్నేహితులు. ఇదిలా ఉండగా.. ప్ర‌ధానిని చంపాల‌నుకున్న విక్ర‌మ్ అనే ఓ టెర్ర‌రిస్ట్ ప‌థ‌కం ప్ర‌కారం కాశ్మీర్‌లో ప్ర‌ధాని చంద్ర‌కాంత్‌ను బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేస్తాడు.
చంద్ర‌కాంత్ స్థానంలో ఆయ‌న కుమారుడు అభిషేక్‌(ఆర్య‌) ప్ర‌ధాని అవుతాడు. అయితే కుర్రాడు. ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం ఉండ‌దు. అయితే ర‌వికాంత్ నిజాయితీపై ఉన్న న‌మ్మ‌కంతో అత‌డినే ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా అభిషేక్ నియ‌మించుకుంటాడు. మ‌హ‌దేవ్ కంపెనీస్ అధినేత మ‌హ‌దేవ్‌(బోమ‌న్ ఇరాని) గ్యాస్ కోసం గోదావ‌రి జిల్లాల‌లోని పంట భూమినంతంటినీ నాశ‌నం చేస్తుంటాడు. ఎదురు తిరిగిన వారిని అణ‌గ‌దొక్కేస్తుంటాడు. అయితే మ‌హ‌దేవ్ మైనింగ్ ప‌నుల‌కు ప్రధానిగా ఉన్న అభిషేక్ అడ్డు చెబుతాడు. అప్పుడు మ‌హ‌దేవ్ ఏం చేస్తాడు? అస‌లు ప్ర‌ధాని చంద్రకాంత్‌ను చంపిందెవరు? ఎందుకు చంపుతారు? వారి ప‌థ‌క‌మేంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేష‌ణ‌:
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే సూర్య ఎన్‌.ఎస్‌.జి క‌మాండో ర‌వి పాత్ర‌లో ఒదిగిపోయారు. లుక్, ఫిజిక్ త‌దిత‌ర విష‌యాల‌పై ఆయ‌న తీసుకున్నస్పెష‌ల్ కేర్ మ‌న‌కు తెర‌పై క‌ప‌డుతుంది. ఇక యాక్ష‌న్ పార్ట్‌లో సూర్య చ‌క్క‌గా న‌టించాడు. సినిమా అంతా ప్ర‌ధానంగా స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కోణంలోనే సాగుతుంది. దానిక‌నుగుణంగానే సూర్య పాత్ర‌ను డిజైన్ చేశారు. సూర్య త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. ఇక మోహ‌న్‌లాల్ ప్ర‌ధాని పాత్ర‌లో చ‌క్క‌గా స‌రిపోయారు. పాత్ర‌లో హుందాగా క‌నిపించారు. ఇలాంటి పాత్ర‌ను చేయ‌డం ఆయ‌న‌కు పెద్ద‌గా క‌ష్ట‌మేమీ కాదు. ఇక ఆర్య రోల్ సెకండాఫ్‌లో ప్ర‌ధానంగా సాగుతుంది. అస‌లు ఆర్య ఎక్కడ మెయిన్ విల‌నో అనే సందేహం ప్రేక్ష‌కుడికి రాక మాన‌దు. అయితే అందుకు ఆస్కారం లేకుండా సినిమా ఆసాంతం సాగుతుంది. సెకండాఫ్‌లో ఓ కొలిక్కి వ‌చ్చేస‌రికి సినిమాలో ఆస‌క్తి పెద్ద‌గా ఎదీ ఉండ‌దు. ఏదో సినిమా చూస్తున్నామ‌నే భావ‌న మాత్రం ఉంటుంది. సినిమా సామాన్య ప్రేక్షకుడికి పెద్ద‌గా క‌నెక్ట్ కాకపోవచ్చు.
స‌యేషా సైగ‌ల్ పాత్ర చాలా ప‌రిమితంగా ఉంది. పాట‌లు, రెండు, మూడు ల‌వ్ సీన్స్‌కే ప‌రిమిత‌మైంది. స‌ముద్ర‌ఖ‌ని, పూర్ణ ఇత‌ర పాత్ర‌ధారులు వారి వారి పాత్ర‌లకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శ‌కుడు కె.వి.ఆనంద్ ఇది వ‌ర‌కు సూర్య‌తో తెర‌కెక్కించిన డిఫ‌రెంట్ ఫార్మేట్ థ్రిల్ల‌ర్ జోన‌ర్స్‌లోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. సెకండాఫ్‌, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ అన్నీ తేలిపోయాయి. గ్రిప్పింగ్‌, ఎంగేజింగ్ సీన్స్ లేవు. ల‌వ్ ట్రాక్ గురించి ఇక చెప్ప‌నక్క‌ర్లేదు. బోరింగ్‌గా ఉంది. పాటలు ఉండ‌టం వ‌ల్ల సినిమాపై ఉన్న ఆస‌క్తి కాస్త పోతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. ఎం.ఎస్‌.ప్ర‌భు కెమెరా ప‌నితనం బాగానే ఉంది. సినిమాలో కామెడి, ఎంట‌ర్ టైన్‌మెంట్ కానీ .. ఎక్క‌డా ప్రేక్ష‌కుడికి క‌న‌ప‌డ‌దు.
చివ‌ర‌గా.. బందోబ‌స్త్‌.. ఆస‌క్తిక‌రంగా లేని స్పై యాక్ష‌న్ మూవీ… సూర్య‌ను అభిమానించే వారు ఆయ‌న కోసం ఓసారి చూడొచ్చు
రేటింగ్‌: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here