బండ్ల గణేష్‌పై కేసు నమోదు

0
4

బండ్ల గణేష్‌పై కేసు నమోదు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదైంది. నిన్న రాత్రి బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి పొట్లూరి వరప్రసాద్‌ను బెదిరించారు. దీంతో గణేష్‌పై వరప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బండ్ల గణేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రానికి సంబంధించి రూ. 30 కోట్లు పెట్టుబడిగా బండ్ల గణేష్ కు ప్రొడ్యూసర్ పొట్లూరి వరప్రసాద్ ఇచ్చారు. అయితే సినిమా విడుదల సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించిన గణేష్.. మిగతా మొత్తానికి చెక్కులను అందజేశారు వరప్రసాద్ కు. అయితే పూర్తిగా డబ్బులు చెల్లించలేదని, మిగతా డబ్బులు ఇవ్వాలని గణేష్ ను వరప్రసాద్ కోరారు. దీంతో డబ్బులు అడుగుతావా? అంటూ గణేష్ అనుచరులు పొట్లూరిని బెదిరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here