బంగారు తల్లి వచ్చింది

0
21
Jyothika First Look In Ponmagal Vanthal Movie - Sakshi

కెరీర్‌పరంగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జ్యోతిక జోరు బాగుంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నారు. గత ఏడాది ‘రాక్షసి’, ‘జాక్‌పాట్‌’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే మరిది కార్తీతో కలిసి ‘తంబి’ అనే సినిమా చేశారు. ఇప్పుడు జ్యోతిక టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ (బంగారు తల్లి వచ్చింది అని అర్థం). ఇందులో లాయర్‌ పాత్ర చేస్తున్నారామె. జ్యోతిక భర్త, హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక లుక్‌ని విడుదల చేశారు. ఇదొక థ్రిల్లర్‌ మూవీ అని సమాచారం. జేజే ఫ్రెడ్రిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here