ఫిబ్రవరి 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘HIT’ చిత్రం

0
2

విశ్వక్‌సేన్‌ కీలక పాత్రలో శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హిట్’. ‘నేచురల్‌ స్టార్‌’ నాని సమర్పణలో ‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ‘హిట్‌’ అనే పేరును టైటిల్‌గా ప్రకటించగానే అసలు దాని వెనుక అర్థం కోసం చాలా మంది వెతికారు. తాజాగా ‘HIT’ అంటే ఏంటో చెబుతూ చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.

ఓ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తూ విశ్వక్‌సేన్‌ అందులో కనిపించారు. కేసు పూర్తి వివరాలను ‘HIT’లో పెట్టనున్నట్లు తెలపగా, ”సర్‌ ‘HIT’ అంటే ఏంటి” అని విలేకరి ప్రశ్నించడంతో ‘HIT’.. హోమ్‌ సైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ అని దాని వెనుక ఉన్న అర్థాన్ని చెప్పారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్‌సేన్‌కు జంటగా రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here