ఫిబ్రవరి 21న విడుదల కానున్ననితిన్‌ ‘భీష్మ’ చిత్రం

0
3

‘హై క్లాసు నుంచి లో క్లాసుదాకా..’, ‘వాటే..వాటే..వాటే బ్యూటీ’ పాటల తర్వాత ‘భీష్మ: సింగిల్‌ ఫరెవర్‌’ చిత్రం నుంచి ‘సరాసరి గుండెల్లో దించావే.. మరీ మరీ మైకంలో ముంచావే.. అయినా సరే ఈ బాధ బాగుందే’ అనే పాట లిరికల్‌ వీడియోను ఆదివారం విడు దల చేశారు. నితిన్, రష్మికా మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ‘సరాసరి..’ పాటకు శ్రీమణి లిరిక్స్‌ అందించగా, అనురాగ్‌ కులకర్ణి పాడారు.  రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శేఖర్‌ మాస్టర్‌ నేతృత్వంలో ఈ పాట చిత్రీకరించారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. ‘భీష్మ’  ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే… నితిన్‌ వివాహం ఏప్రిల్‌ 16న జరగనుంది. తన స్నేహితురాలు షాలినీతో నితిన్‌ ఏడడుగులు వేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here