ఫారెస్ట్‌కు పయనించబోతున్న బన్ని

0
6

Image result for bunny latest images

బన్నీ అడవుల్లో డ్రైవింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నాడటా..‌.! సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా మైత్రీ సినిమా మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను త్వరలో తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ బన్నీపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్‌ చేశారట. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్‌ అధికారి పాత్రలో విజయ్‌ సేతుపతి, విలన్‌గా జగపతిబాబు నటిస్తారని తెలిసారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here