ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

0
7
Bhai Dooj Celebrating in Mahesh Babu Home Photos Viral - Sakshiఅన్న గౌతమ్‌కు బొట్టు పెడుతున్న సితార

బంజారాహిల్స్‌: కార్తీకమాసంలో ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ‘బాయిదూజ్‌’ వేడుక ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించింది. ఈ పండగ రోజు అక్క,చెల్లెళ్లు తమ సోదరులకు హారతి ఇచ్చి నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని పూజలు చేస్తారు. అంతేకాదు ఆ రోజు తమ సోదరులకు బహుమతులు కూడా ఇస్తారు. రాఖీ పండుగ తరహాలో జరిగే ఈ వేడుక బుధవారం టాలీవుడ్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌బాబు ఇంట్లో చేసుకున్నారు. కూతురు సితార తన అన్న గౌతంకృష్ణకు నుదుటున బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. ఈ సెలబ్రేషన్స్‌ ఫొటోలను నమ్రతా శిరోద్కర్‌ ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. వీటిని చూసిన ప్రిన్స్‌ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here