ప్రామిస్‌ చేస్తున్నా.. ఇది సూపర్‌ సాంగ్‌..!

0
14

హైదరాబాద్‌: ఆ ఆల్బమ్‌ నుంచి నా ఫేవరెట్‌ సాంగ్‌ను ఎంచుకోవడం చాలా కష్టంగా ఉందని అంటున్నారు నటి పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’, ‘ఓ మైగాడ్‌ డాడీ’ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘రాములోరాములా’ పాటలు 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించి యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరోపాట టీజర్‌ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకొంటివే’ అంటూ సాగే పాటను గీతా ఆర్ట్స్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ఈ పూర్తి పాటను 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గీతా ఆర్ట్స్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన పూజా హెగ్డే.. ‘మీరు వినే వాటిలో ఈ పాట చాలా అద్భుతంగా ఉండబోతోందని నేను ప్రామిస్‌ చేస్తున్నాను. ‘అల..వైకుంఠపురములో’ ఆల్బమ్‌ నుంచి నా ఫేవరెట్‌ సాంగ్‌ను సెలక్ట్‌ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది’ అని పేర్కొన్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. టబు, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, నవదీప్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here