‘ప్రభాస్’ మూవీ ‘ఆదిత్య 369’లాగే ఉంటుందట

0
19

దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్యాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని నాగ్ అశ్విన్ స్వయంగా చెప్పాడు. దాంతో ఈ సినిమా కథా వస్తువు ఎలాంటిదై ఉంటుందనే ఆసక్తి అందరిలో తలెత్తింది. ఈ సినిమా .. ‘ఆదిత్య 369’ తరహాలో సాగుతుందనేది తాజా సమాచారం. ఆ సినిమా తరహాలోనే కాలంలో వెనక్కి వెళ్లడం .. భవిష్యత్తులోకి వెళ్లడం వంటివి ఈ సినిమాలో వుంటాయట. అయితే ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందట. ఈ సినిమాకి సంబంధించి 80 శాతం షూటింగ్ గ్రీన్ మ్యాట్ లోనే నాగ్ అశ్విన్ చిత్రీకరించనున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ హీరో. ప్రభాస్ కి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here