ప్రతి సినిమాలో ‘వెన్నెల’

0
19

హాస్య నటులకు ఈ సీజన్‌ బాగుంది. హీరోతో పాటుగా ఉంటూ వినోదం పంచేందుకు వీరి అవసరం ఎక్కువైంది. అందుకే ప్రతి సినిమాలో కమేడియన్స్‌ కనిపిస్తున్నారు. ఒకప్పుడు వేణుమాధవ్‌, సునీల్‌ పోషించి బాధ్యతను ఇప్పుడు వెన్నెల కిషోర్‌ తీసుకున్నాడు. నిజానికి సునీల్‌ హీరోగా టర్న్‌ అయ్యాకే వెన్నెలకు డిమాండ్‌ పెరిగిందని అంటారు. ఇది నిజమే అన్నట్టుగానే బిజీ అయ్యాడు. ఇటీవలే వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాల్లో వెన్నెల ఎంతగా నవ్వించాడో తెలిసిందే. భీష్మ చిత్రం ద్వితీయార్ధాన్ని తన భుజస్కందాలపై మోశాడని చెప్పవచ్చు. వెన్నెల టైమింగ్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హాస్యనటునిగా వెన్నెలకు పేరుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here