పూరి-విజయ్ కాంబో ‘ఫైటర్’ షూటింగ్ షురూ

0
3

ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్లు చాలా బజ్ క్రియేట్ చేస్తూంటాయి. హీరో – హీరోయిన్లు, హీరో – దర్శకుడు, హీరో – బ్యానర్, హీరో – నిర్మాత.. ఇలా చాలా కాంబనేషన్లు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూంటాయి. ఈ మధ్య కాలంలో అలాంటి బజ్ క్రియేట్ చేసింది పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్. మాస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన పూరి, యూత్ కి ఐకాన్ లా మారిన విజయ్ దేవరకొండ కాంబోలో సినమా అంటే అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం వీరిద్దరూ ఫైటర్ అనే సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి కథా చర్చలు, స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక షూటింగ్ కు వెళ్లడమే మిగిలింది. దీనికి ముహూర్తం ఖరారు చేశాడు పూరి. ఈ నెలాఖరు నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. హైస్పీడ్ గా వర్క్ చేసి వేసవికి గానీ దసరాకు గానీ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో విజయ్ కొన్ని ఛేంజెస్ చెప్పాడని కొన్ని వార్తలు వచ్చాయి. పూరికే కథల్లో ఛేంజెస్ చెప్పేంత ఎదిగిపోయాడా అనే విమర్శలూ వచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ ప్రస్తుతానికైతే ఈ సినిమి రెగ్యులర్ షూటింగ్ పై మాత్రం క్లారిటీ వచ్చేసింది.

చాన్నాళ్ల తర్వాత పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. మాసెస్ తన మార్క్ చూపించి ఇండస్ట్రీని షాక్ చేశాడు. యూత్ లో విపరీతమైన ఉన్న ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పటి వరకూ లవ్, క్లాస్ పాత్రలే చేశాడు. తొలిసారి పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. అది కూడా పూరి దర్శకత్వంలో దీంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here