పార్టీ సాంగ్‌కి చిన్నారి స్టెప్పులు.. ఫిదా అయిన త‌మన్నా

0
5

మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు రాబ‌డుతుంది. మ‌హేష్ ప‌ర్‌ఫార్మెన్స్, ర‌ష్మిక అంద‌చందాల‌తో పాటు దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌ని ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ కూడా ఆక‌ట్టుకుంది. ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా.. డాంగ్ డాంగ్‌’ అంటూ సాగే ఈ పాట‌ని పాడుకుంటూ, స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి ఈ పాటని పాడుతూ, అందుకు త‌గ్గ‌ట్టు స్టెప్పులు వేస్తుంది. చిన్నారి ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయిన త‌మ‌న్నా త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో షేర్ చేస్తూ.. ఓ మై గాడ్, అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌. ఈ పార్టీ సాంగ్‌ని ప్ర‌తి ఒక్క‌రు ఇష్ట‌ప‌డుతున్నారు అని పేర్కొంది. డాంగ్ డాంగ్ సాంగ్‌ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. మహేష్ బాబు, త‌మ‌న్నా పోటాపోటీగా స్టెప్స్ వేశారు.

Embedded video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here